పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. పవన్ ఐదేళ్ల సంపాదన రూ. 114.76 కోట్లు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ. 73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64.26 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక ఆయన అందజేసిన విరాళాలు వచ్చేసి రూ. 20 కోట్లు. అలానే కొడుకు అకిరా అనంద్, కుమార్తె ఆద్య పేర్లను కూడా అఫిడవిట్లో వెల్లడించారు.