ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడిపై ముంబై ఫ్రాంచైజీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు ఓటములకు అతడే కారణమని భావిస్తున్నట్లు టాక్. దీంతో ఆ జట్టు పగ్గాలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేనేజ్‌మెంట్ తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2024 సీజన్‌ను ముంబై ఇండియన్స్ పేలవంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే ముంబై దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఏకంగా 277 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. పాండ్యా కెప్టెన్స్ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
మరోవైపు ప్రేక్షకుల హేళనలను పట్టించుకోవద్దని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సూచించారు. ‘బయటి వ్యక్తులకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుందో తెలియదు. బాల్ టాంపరింగ్ ఘటన తర్వాత నన్ను ప్రతిచోటా క్రికెట్ అభిమానులు ఎగతాళి చేశారు. నేను వాటిని పట్టించుకోలేదు. హార్దిక్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యతిరేకత ఎదుర్కోలేదు కాబట్టి ఇప్పుడు కాస్త ప్రభావం చూపొచ్చు’ అని పేర్కొన్నారు.