MegaFamily: ఆపదలో ఉన్నప్పుడు మెగా కుటుంబం అండగా ఉంటారు.. జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్

0
43

పాయింట్ బ్లాంక్, సినిమా: టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జూలై 2న ఆయన పుట్టిన రోజు తర్వాత మెగా ఫ్యామిలీ గురించి చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా రామ్ చరణ్, ఉపాసనతో తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. ‘‘సరైన సమయంలో సాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న తన ఇంటికి పిలిచినప్పుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యూనియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ లాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టం గా భావిస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం జానీ మాస్టర్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.