జూబ్లీహిల్స్‌లోని వెంగళరావునగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై కొందరు మహిళలు దాడికి దిగారు. ఈ ఘటనలో దేదీప్యరావుకు గాయాలయ్యాయి. ఫ్లెక్సీ వివాదం కారణంగానే ఆమెపై ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. యూసుఫ్‌గూడ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు రోడ్ల పక్కన ఉండటంతో వాటిని తొలగించాలంటూ దేదీప్యరావు ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఈక్రమంలో మంగళవారం రాత్రి ఫ్లెక్సీలు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చారు. తొలగింపు సమయంలో అక్కడికి వచ్చిన కొందరు మహిళలు వారిని అడ్డుకున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. కార్పొరేటర్ దేదీప్యరావుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమె నేరుగా ఘటనాస్థలికి వచ్చారు. అక్కడే ఉన్న మహిళలు కార్పొరేటర్‌తో వాగ్వాదానికి దిగడమే కాకుండా ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో దేదీప్యరావు గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దేదీప్య రావు పై మహిళలు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దేదీప్య రావు, ఆమె భర్త విజయ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక కార్పొరేటర్ పై దాడి చేసిన మహిళలు ఇదే సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పైన కూడా సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ అరాచకాలు కూడా పెట్రేగి పోయాయని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.