లోక్ సభ ఎన్నికల వేళ పొలిటికల్ జంపింగ్స్ పెరుగుతున్నాయి. ఎవరు ఏ పార్టీ అనేది చెప్పరాకుండా ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నట్టుగా పరిస్థితి తయారైంది. తాజాగా యాదాద్రి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది.
లోక్ సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ వేవ్ నడుస్తోంది. జాతీయ పార్టీలు ఎక్కడ బలంగా ఉంటే అందులోకి బీఆర్ఎస్ లీడర్లు జారుకుంటున్నారు. కాంగ్రెస్ లోకి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట భువనగిరి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.
పార్టీ మారే స్కెచ్ బెంగళూరులో జరిగిందట. పైళ్ల శేఖర్ రెడ్డి పార్టీ మారేందుకు ముందు కాంగ్రెస్ కీలక నేతలను ఆయన సంప్రదించారట. బీఆర్ఎస్ ప్రముఖ లీడర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరవెనుక రాజకీయం నడిప్సుతన్నారు. భువనగిరి, నల్గొండ లోక్ సభలను గెలుచుకునే టార్గెట్ తో పావులు కదుపుతున్నారు.