లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలు దూకుడు పెంచాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరో నియోజకవర్గం మల్కాజ్ గిరి అభ్యర్థిని పైనల్ చేశారని ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శంభీపూర్ రాజును కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా మల్కాజ్ గిరి ఎంపీ సీటును ఆశించిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించటంతో కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా బరిలోకి దిపింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్‌లు వేస్తున్నారు.మైనంపల్లి హనుమంత రావు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.
శంభీపూర్ రాజు ప్రస్థానం
శంభీపూర్ రాజు1980 JAN 4న కుత్బుల్లాపూర్ పరిధి శంభీపూర్ గ్రామంలో జన్మించారు. 2001లో KCR ప్రారంభించిన TRSలో చేరి మండల కోశాధికారిగా వ్యవహరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన పాల్గొన్నారు. 2016 RR జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో MLCగా గెలిచారు. 2021 లో మరోసారి MLC అయ్యారు. 2022 నుంచి మేడ్చల్ జిల్లా BRS అధ్యక్షుడిగా ఉన్నారు