Kedarnath Temple: కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్

0
12

కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగ క్షేత్రమైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. . ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో బీకేటీసీ చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని ప్రకటించారు. గత ఏడాది యాత్రా కాలంలో రికార్డు స్థాయిలో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారని, ఈ ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరగనున్నదని ఆయన చెప్పారు. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి 22 కి.మీ ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్‌నాథ్‌ ఆలయం చేరుకోవచ్చు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు సందర్శించే ఈ దేవాలయాన్ని మంచు కారణంగా శీతాకాలంలో మూసివేస్తారు. వేసవి కాలంలో తిరిగి ఆలయాన్ని తెరుస్తారు.