Kodali Nani Comments On Politics: ఇవే నాకు చివరి ఎన్నికలు.. మళ్లీ పోటీ చేయను: కోడాలి నాని

0
18

తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని(కోడాలి వెంకటేశ్వర్ రావు) తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. మళ్లీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేను. అందుకే 2029 ఎన్నికలకు దూరంగా ఉంటా. నా కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదు. నా తమ్ముడి కొడుక్కి ఆసక్తి ఉంటే అప్పటికి పోటీలో ఉండొచ్చు’ అని ఆయన తెలిపారు.

అయితే ఈ సారి గుడివాడ టికెట్‌ కొడాలి నానికి కాకుండా మం డలి హనుమంతరావుకు ఇస్తారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. కొడాలి నానికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు, నేతలు.. ఈసారి గుడివాడ టికెట్ మండలి హనుమంతరావుకే అని చర్చించుకుంటున్నారు.

కోడాలి నాని 2004, 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . 2014 లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో నాని మళ్లీ గుడివాడ నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో జూన్ 8న పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా నాని ప్రమాణ స్వీకారం చేశారు, 2022 ఏప్రిల్ 7 వరకు ఆ పదవిలో కొనసాగారు.