పీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తాజాగా జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు.
అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్‌గా మారిన దస్తగిరి పార్టీలో చేరారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పై జై భీం రావు భారత్ పార్టీ తరపున సీఎం జగన్‌పై దస్తగిరి పోటీ చేయనున్నారు. మరోవైపు వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో.. ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యాడు.