పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులు కావడం తెలిసిందే. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌కు వదిన సురేఖ నుంచి అపురూపమైన కానుక లభించింది. తెలుగు ప్రజల ఆశలు నెరవేర్చాలంటూ స్పెషల్ గిఫ్ట్ అందజేశారు. రూ. 2,53,975 ఖరీదైన మోంట్‌బ్లాంక్ లిమిటెడ్ ఎడిషన్ పెన్ను ఆమె పవన్ కళ్యాణ్‌కు బహూకరించారు. వదినమ్మ నుంచి అందిన స్పెషల్ గిఫ్ట్ చూసి పవన్ కళ్యాణ్ అమితానందం వ్యక్తం చేశారు. ఆ ఖరీదైన పెన్నును జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్, అన్నా లెజనోవా, సురేఖ, మెగాస్టార్ చిరంజీవి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.