Silver Coins: ఉపాధిహామీ కూలీలకు దొరికిన వెండి నాణేల బాక్స్

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో గుప్త నిధుల కోసం వెతకని వారంటూ ఉండరు. పాడుబడిన ఆలయాలను కనిపిస్తే చాలు వాళ్లకు పండగే, చీకటి పడగానే పని కానిచ్చేస్తారు. స్వలాభం కోసం దేవతా మూర్తులను పెకలించి మరీ గుప్త నిధులను శోధిస్తారు. అయితే, తాజాగా సిద్ధిపేట జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఓ పొలాన్ని చదును చేస్తుండగా.. వారికి రాయితో చేసిన బాక్స్ కనిపించింది. అందులో 25 వెండి నాణేలు ఉన్నాయి. అదేవిధంగా వెండితో చేసిన రెండు ఉంగారాల కూడా లభ్యమయ్యాయి. ఈ విషయంలో అందరి నోట్లో పడటంతో ఊరుఊరంతా ఆ నాణేలను చూసేందుకు ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.