Liquor Scam: కవిత, కేజ్రీవాల్ తో పాటుగా లిక్కర్ స్కాంలో ఎవరెవరు అరెస్టయ్యారంటే?

0
16

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాగుంట రాఘవ, విజయ్ నాయర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేశ్ జోషి, అమన్ ‌దీప్, అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసింది.

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ఈడీ ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్‌, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అవినీతి కేసుల్లో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు సీఎంలు అరెస్టయ్యారు. భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.