Liquor Scam: వైరల్ .. కేజ్రీవాల్ అరెస్ట్.. 2022లోనే చెప్పిన ఆస్ట్రాలజర్

0
12

సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిషం నిజమైంది. ‘మార్చి 2024 నుంచి కేజ్రీవాల్‌కు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అరెస్ట్ అవుతారు. తర్వాత ఢిల్లీ సీఎం ఎవరో కూడా నాకు తెలుసు. తర్వాత చెబుతా. అతడి కర్మ ఫలం 2025 ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుంది. తర్వాత నుంచి కేజ్రీవాల్ రాజకీయ పతనం మొదలవుతుంది’ అని 2022 మార్చి 25న ఆయన ట్వీట్ చేశారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల సమగ్ర వివరాలను వెల్లడించడానికి, ఈ అరెస్టుకు సంబంధం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బాండ్ల విషయాన్ని మీడియా హైలైట్ చేయకుండా ఉండేందుకే ఢిల్లీ సీఎంను అరెస్టు చేశారని అనుమానిస్తున్నారు. కాగా, బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు వచ్చాయని మార్చి 14న తెలియగా, మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు.

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్‌, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.