EC: జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం: ఈసీ

0
25

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ రోజైన జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల అంచనాలు, సర్వేలు ప్రసారం చేయొద్దని ఆదేశించింది.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఈసీ ప్రవేశపెట్టిన ‘cVIGIL’ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిన్న ఉదయం వరకు 79వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తెలిపింది. వీటిలో 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించామంది. అక్రమ హోర్డింగులు, బ్యానర్‌లకు సంబంధించి దాదాపు 58,500, నగదు, బహుమతులు, మద్యం పంపిణీపై 1,400 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది.