Mahabubnagar MLC Elections: పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నిక.. గెలుపెవరిది.?

0
19

మహబూబ్ నగర్ లోక ల్ బాడీ బై పోల్ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి నందిగామ మండలం మామిడిపల్లికి చెందిన ఎన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. బీజేపీ ఎన్నికల్లో పోటీచేయకపోచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల నుండి ఎంపికైన 1445 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో అత్యధికంగా 850 మంది బీఆర్ఎస్‌కు చెందిన ఓటర్లు ఉండగా, 350 కాంగ్రెస్ ఓటర్లు ఉండగా, మిగతావారు బిజెపి ఇతర పార్టీలు, స్వతంత్రులు ఓటర్లుగా ఉన్నారు.

అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్​పార్టీ చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 కు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్​అభ్యర్ధులే గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోకల్​బాడీలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్​లోకి వలస వచ్చారు. దీంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది