AP Politics: మంచు మనోజ్ వివరణ.. నేను ఏ పార్టీని అనలేదు

0
25

మంచు మనోజ్ రాజకీయాలు,ఓటు హక్కు వినియోగంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా దీనిపై ట్విట్టర్లో మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను ఏ పార్టీనీ ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు. రాజకీయ హద్దులు దాటి.. ఐక్యత, గౌరవంతో ముందుకు సాగాలనేది తన ఉద్దేశమని తెలిపారు. లైవ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తాను మాట్లాడిన కొన్ని కీలక అంశాలు ప్రసారం కాలేదని, అది కాస్తా తప్పుడు అర్థాలకు దారితీసిందన్నారు.

మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ఇటీవల తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు.ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. సరైన వ్యక్తిని గెలిపించండి. ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వారికే మద్దతు ఇవ్వండి. సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వాడు మనకేం న్యాయం చేస్తాడు. ఎవరైనా డబ్బులిస్తే థ్యాంక్స్ చెప్పండి. ఓటు మాత్రం సరైన వ్యక్తికే వేయండి.అందరిని కలుపుకుని వెళ్లే వాడే అసలైన నాయకుడని, ఎటువంటి మనిషకైనా ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం అనేవి వస్తే అవి అతని పతనానికి దారితీస్తాయని, అంతా నాది అనుకునేవాడికి, పీస్ ఆఫ్ మైండ్ ఇక ఉండదు అని చెప్పారు. మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఏపీలోని వైసీపీని ఉద్దేశించే మనోజ్ చేశాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

వివాదం పెద్దదవుతుండటంతో మనోజ్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. నాన్న పుట్టినరోజు వేడుకల్లో నా ప్రసంగంపై నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలనుకున్నా. ప్రతీది రాజకీయంగా చూడకుండా ఐక్యత, గౌరవంగా ముందుకు సాగాలనేది నా మాటల ఉద్దేశం. ఏదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు.ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. గొడవలు కూడా లేవు. అన్ని పార్టీల్లో తన శ్రేయోభిలాషులు ఉన్నారు. నటుడిగా నన్ను, నా కుటుంబాన్ని ఆదిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు