బీఎస్పీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మంద ప్రభాకర్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మా యావతి నియమించారు. అంతకుముందు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో బీఎస్పీ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ గా ఉన్న మంద ప్రభాకర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ః
ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తే కొత్త చిక్కులు ఏమైనా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, విధేయుడిగా ఉన్న మంద ప్రభాకర్ నే అధ్యక్షుడిగా నియమించాలని మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కంటే ముందు పార్టీ అధ్యక్షుడిగా మంద ప్రభాకర్ పనిచేశారు.
ప్రవీణ్ కుమార్ ను బీఎస్పీలో ఆహ్వానించి రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగించడంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తోందని మంద ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ నేతలు సమావేశమై 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.