పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు విసిరిన సవాల్‌ను స్వీకరించే పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి లేడని మందకృష్ణ సెటైర్ వేశారు. దీన్ని బట్టే తెలిసిపోతోంది.. హామీలు అమలు చేసే నిజాయితీ, చిత్తశుద్ధి రెండూ రేవంత్ రెడ్డికి లేవని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పడే కాదు.. ఎప్పుడూ మాటమీద నిలబడే వ్యక్తి కాదని అన్నారు. అందుకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లింకుంటారని మందకృష్ణ మాదిగ తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు ఈ ఉదయం ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు. సీఎంకు వచ్చే తీరిక లేకపోతే సిబ్బందితోనైనా రాజీనామా లేఖ పంపాలని సవాల్ మరో సవాల్ చేశారు.