పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: పీసీసీకి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కొత్త అర్థం చెప్పారు. పీసీపీ అంటే ‘పెద్ద క్రెడిట్ చోర్’ అని కొత్త నిర్వచనం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం దీక్ష చేస్తోన్న మోతిలాల్ నాయక్‌కు ఏమైనా జరిగితే కాంగ్రెస్‌దే బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పోయి.. రేవంత్ పాలనలో స్కామ్‌లు వచ్చాయని ఎద్దేవా చేశారు. పాలనను గాలికొదిలేసి.. క్రెడిట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆరాట పడుతున్నారని విమర్శించారు.