Ap CM: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర విశిష్ట అతిథిగా మెగాస్టార్

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ క్రమంలో చిరంజీవి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్నారు. అక్కడి నుంచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళతారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరుకానున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.