MegaStar: ప్రతి బిడ్డకు తండ్రి మొదటి హీరో.. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు- చిరంజీవి

0
18

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: నేడు ఫాదర్స్ డే కావడంతో మొత్తం శుభాకాంక్షల పోస్టులతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది. తమ తండ్రుల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తమ తల్లిదండ్రులతో కలిసి దిగిన పిక్చర్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకటరావుతో కలిసి దిగిన రేర్ పిక్‌ను షేర్ చేశాడు. ‘‘ప్రతి బిడ్డకు తండ్రి మొదటి హీరో. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు!’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం చిరు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు.