AP Politics: గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది- మంత్రి నారాయణ

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో గెలిచిన ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో టీడీపీ పార్టీకి 21 మంత్రి పదవులు వచ్చాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి నారాయణకు కేబినెట్‎లో మరోసారి చోటు దక్కింది. దీంతో ఆదివారం ఉదయం ఆయన మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో ఆయన తన చాంబర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన సీట్‎లో కూర్చుని బాధ్యతలు తీసుకొగా.. సంబంధిత అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి కోసం 32 వేల ఎకాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని.. గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పించారు. అలాగే ఏపీ ప్రజల శ్రేయస్సుకోసం అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని ఆయన తెలిపారు. రెండున్నర ఏళ్లలో అమరావతిని నిర్మించి దేశంలోని టాప్-5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.