పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ పండుగతో కోలాహల వాతారవరణం నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 1న ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇంటి దగ్గరే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనమాక గ్రామంలో ప్రారంభించారు. ఈ మేరకు పెరిగిన పింఛన్‌తో రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పింఛన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. అయితే, ఆయన ఏకంగా లబ్ధిదారుడి కాళ్లు కడిగి మరి పింఛన్ డబ్బులను అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.