పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఉరుకుల పరుగుల జీవితం, నిత్యం ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో సమావేశాలు. ఇక సెక్రటేరియట్‌కు వెళితే సంబంధిత శాఖపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రులు క్షణం తీరిక లేకుండా గుడుపుతున్నారు. వాళ్లకంటూ ఓ కుటుంబం, బరువు బాధ్యతలు లెక్క చేయకుండా పని చేస్తూనే ఉంటారు. అయితే, ఆ బాధ్యతల నుంచి కాస్త చిల్ అయ్యేందుకు మంత్రులు దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు అవుతుంటారు. కానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూటు మాత్రం సపరేటు. బుధవారం ఉదయం ఆయన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో కాస్త చిల్ అయ్యారు. ఏకంగా లుంగీ కట్టి తన వ్యవసాయ క్షేత్రంలో తిరిగారు. ఈ క్రమంలోనే తన పక్క పొలంలో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. మహిళలతోనూ సరదాగా ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఆరా తీశారు. అయితే, అందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి కాస్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Home పాలిటిక్స్ తెలంగాణ TS News: రైతు అవతారమెత్తిన మంత్రి పొంగులేటి.. లుంగీ కట్టి పొలాల్లో తిరుగుతున్న మంత్రి