AP Politiocs: ఏపీ వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సత్యప్రసాద్

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం నుంచి ఎవరూ ఊహించని విధంగా బీజేపీ నుంచి సత్య ప్రసాద్ సంచలన విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై గెలుపోందిన సత్య కుమార్‌కు పొత్తులో భాగంగా సీఎం చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. దీంతో ఆయన నేడు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మొదట తన ఛాంబర్ లో పూజలు నిర్వహించిన సత్య, తన సీట్ లో కూర్చుని మొదటి సంతకాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి వచ్చేందుకు కారణమైన ప్రధాని మోదీ, చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మంత్రిగా ఏపీ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలతో పాటు.. అన్ని రకాల మెడికల్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీసుకుపోయేందుకు అడుగులు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని.. ఆరోగ్యశ్రీ సేవల్లో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి సత్య కుమార్ ఆరోపించారు. వైసీపీ అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని.. దాని ఆధారంగా గత పాలకులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సత్య చెప్పుకొచ్చారు.