పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై ఇక నుంచి ప్రత్యేక దృష్టి ఉంటుందని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఉద్యోగులు సమయానికి ఆఫీసులో హాజరు కాకుంటే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక నుంచి తాను ఆకస్మిక తనిఖీలు చేస్తూనే ఉంటానని.. అధికారులు సమయానికి ఆఫీసులకు హాజరు కావాల్సిందేనని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హెచ్చరించారు.
Home పాలిటిక్స్ తెలంగాణ TS News: వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి తుమ్మల