Mission Divyasra: మిషన్ దివ్యాస్త్రను ముందుండి నడిపింది ఈమెనే.. ఎవరీ షీనా రాణి ?

0
37

ఇటీవల జరిగిన ‘అగ్ని-5’ మిసైల్ ప్రయోగంతో మహిళా శక్తి మరోసారి సత్తా చాటింది. ‘మిషన్ దివ్యాస్త్ర’‌గా పేర్కొన్న ఈ ప్రయోగానికి షీనా రాణి అనే మహిళ నేతృత్వం వహించారు. 1999 నుంచి అగ్ని మిసైల్ వ్యవస్థపై పనిచేసిన అనుభవం ఆమె సొంతం. డీఆర్‌డీఓలోకి ఎంట్రీ ఇచ్చి 25ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ప్రయోగానికి నేతృత్వం వహించడం గమనార్హం. ఆమె భర్త PSRS శాస్త్రి కూడా శాస్త్రవేత్తగా ఇస్రోకు సేవలు అందించారు. 2019లో ISRO ప్రయోగించిన కౌటిల్య ఉపగ్రహానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు.

షీనా రాణి తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యం కలిగిన శిక్షణ పొందారు. అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీర్‌లో మంచి అనుభవం సంపాదించారు. భారతదేశపు అగ్రగామి పౌర రాకెట్ ల్యాబ్ అయిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఆమె ఎనిమిదేళ్లు పనిచేశారు.

1998లో పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత ఆమె పార్శ్వ ప్రవేశంగా DRDOలోకి వచ్చారు. 1999 నుంచి అగ్ని శ్రేణి క్షిపణుల ప్రయోగ నియంత్రణ వ్యవస్థలపై పని చేస్తూ వచ్చారు. దేశ సరిహద్దులను క్షిపణులు రక్షిస్తున్నందున అగ్ని క్షిపణి కార్యక్రమంలో భాగమైనందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను’ అని షీనా అన్నారు. అగ్ని శ్రేణి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన క్షిపణి సాంకేతిక నిపుణుడు ‘అగ్ని పుత్రి’ టెస్సీ థామస్ యొక్క అడుగుజాడల్లో ఆమె వెళ్లారు.