TS Politics: బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది- బల్మూరి వెంకట్

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: పదేళ్లు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని వెంకట్ బల్మూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్ష చేస్తున్నాడని తెలిపారు. ఆ సోదరడి ఆవేదన తెలుసుకుని సీఎం రేవంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చేందుకే గాంధీ ఆసుపత్రికి వెళ్లినట్లుగా తెలిపారు. ఆనాడు రాష్ట్రంలో బోడ సునీల్, ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడినా.. మాట్లాడని బీఆర్ఎస్ నాయకులు నేడు అవాకులు చెవాకులు పెలుతున్నారని మండిపడ్డారు. అందరికీ ఉద్యోగాలు రావు హమాలీ పనులు చేసుకోవాలని నాటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేయడం జనం మరిచిపోలేదని అన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలపై ఆందోళన చేయడానికి ధర్నా చౌక్ వద్దకు వెళ్లకుండా అరెస్ట్ అడ్డుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావు ఏదైనా మాట్లాడదలకుంటే ప్రవళిక మరణంపై క్షమాపణ చెప్పి మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 10 పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. నిరుద్యోగుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు బల్మూరి వెంకట్.

అలానే డీఎస్సీ అప్లికేషన్‌కు అభ్యర్థుల నుంచి కనీసం ఫీజు కూడా తీసుకోవడం లేదని.. టెట్ విషయంలో, ఇతర అంశాల్లో నిరుద్యోగులకు సర్కార్ సానుకూలంగా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మెగా డీఎస్సీ వేశామని తెలిపారు. సింగరేణి జెన్‌కో పరీక్ష, కేంద్ర ప్రభుత్వ పరీక్షా ఒకేరోజు ఉండటంతో జెన్‌కో పరీక్షను వాయిదా వేసిట్లుగా పేర్కొన్నారు. నిరుద్యోగులకు అండగ నిలబడేందుకు త్వరలోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతోందని వెంకట్ బల్మూరి ప్రకటించారు.