MLC Kavitha Protest: జీవో నెం.3 రద్దు చేయాలని కవిత డిమాండ్

0
14

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీవో నెం.3 శరాఘాతంగా నిలుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆమె దీక్షకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది.

ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, మాగంటి గోపినాథ్‌ మద్దతు తెలిపారు. జీవో నెం.3 మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతోందని కవిత అన్నారు. మహిళలకు న్యాయం జరిగే జీవో 41ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యక్తిగత కారణాలతో మరణించిన అమ్మాయిని కూడా రాజకీయంగా కాంగ్రెస్‌ వాడుకుందని కవిత ఆరోపించారు.

మహిళలకు రెండు రిజర్వేషన్లు కల్పించేలా గతంలో ఆదేశాలు ఉండేవి.. మహిళలకు రోస్టర్ విధానంలో రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని కవిత విమర్శించారు. రోస్టర్ పాయింట్ రద్దు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని, మహిళలకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడుతుందని కవిత అన్నారు.