BREAKING: ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 14 వరకు పొడిగించింది. సీబీఐ, ఈడీ అరెస్టు అనంతరం ఆమెకు స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో జ్యుడిషియల్ రిమాండ్ అనివార్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ తరఫు న్యాయవాది స్పెషల్ జడ్జి కావేరి బవేజాను రిక్వెస్టు చేశారు. వారం రోజుల్లో ఆమెపై చార్చిషీట్‌‌ను దాఖలు చేయనున్నట్లు స్పెషల్ జడ్జికి వివరించారు. హైదరాబాద్‌లో మార్చి 15న అమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో చార్షిషీట్‌ను దాఖలు చేయాల్సి ఉన్నది. ఆ ప్రకారం ఈ నెల 15లోగా చార్షిషీట్‌ను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె రిమాండ్‌ను స్పెషల్ జడ్జి మే 14 వరకు పొడిగించారు.

నెల రోజుల విరామం తర్వాత ఆమెను ఫస్ట్ టైమ్ ఫిజికల్‌గా కోర్టుకు హాజరు పరిచారు పోలీసులు. జై తెలంగాణ… జై భారత్ నినాదాలు మాత్రమే చేసిన కవిత దర్యాప్తు సంస్థలపై ఎలాంటి కామెంట్లు చేయకుండా సైలెంట్‌గానే ఉండిపోయారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 20 వరకు పొడిగించారు. కేజ్రీవాల్‌ను ఫిజికల్‌గా హాజరుపర్చడానికి బదులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా తీహార్ జైలు నుంచే అటెండ్ అయ్యేలా పోలీసులు, జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. కవిత కూడా అదే జైలులో ఉన్నప్పటికీ ఆమె దాఖలు చేసిన అప్లికేషన్‌ను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఆమెను వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పరిచేందుకు అనుమతించారు.