టీమ్ఇండియా క్రికెటర్ షమీపై మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. ‘షమీ నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. యూపీ పోలీసుల సహాయంతో అతడు ఈ పథకం రచిస్తున్నాడు’ అని సంచలన కామెంట్స్ చేశారు. కాగా షమీ, జహాన్‌ను 2014లో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018లో కట్నం సహా పలు అంశాలలో షమీ వేధిస్తున్నాడంటూ అతడిపై కేసు పెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
షమీతో కొంత కాలంగా దూరంగా ఉంటున్న ఆయన భార్య హసీన్ జహాన్ షమీపై గతంలో కూడా పలు ఆరోపణలు చేశారు. షమీపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. గత 4 సంవత్సరాలుగా షమీ అరెస్ట్ వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తేయాలని సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. షమీ జాతీయ క్రికెట్ జట్టుతో పర్యటనలలో ఉన్నప్పుడు కూడా వేశ్యలతో వివాహేతర సంబంధాలు కొనసాగించారని ఆరోపించింది. ఇప్పటికీ కూడా సంబంధాలు కొనసాగిస్తున్నాడని చెప్పారు.