AP POLITICS: తండ్రి కూతురు మధ్య మాటల యుద్ధం

0
19

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం హాట్ హాట్ గా మారింది. ఇక్కడ కాపు ఓట్లే ప్రధాన లక్ష్యంగా రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కూతురు క్రాంతి భారతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మా నాన్నని నమ్మొద్దు అంటూ ముద్రగడ పద్మనాభం కూతురు కాంత్రి అంటుంటే.., అసలు నా కూతురు నా ప్రాపర్టీ కాదు అంటూ ముద్రగడ పద్మనాభం అంటున్నారు. ఈరోజు ఉదయం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి భారతి ఒక వీడియోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.., వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్ట పడొచ్చు తప్పు లేదని… జగన్ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదన్నారు క్రాంతి భారతి. తన తండ్రి తీరుని మార్చుకోవాలని.., కేవలం కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే ముద్రగడని సీఎం వైఎస్ జగన్ వాడుతున్నాడని.. ఎన్నికల తర్వాత ముద్రగడ ఎటు కాకుండా పోవడం ఖాయమని అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని క్రాంతి భారతి స్పష్టం చేశారు.

యాంకర్-2: అయితే తన కూతురు క్రాంతి భారత్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురి వ్యాఖ్యలకు తాను భయపడేది లేదని.., అసలు తన కూతురు తన ప్రాపర్టీ కాదని ముద్రగడ పద్మనాభం తెలిపారు. తన కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ అని.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని పద్మనాభం అన్నారు. అమె చేత జనసేన వాళ్లు కావాలనే వీడియో రిలీజ్ చేయించారని.., ఎవరు బెదిరించినా తాను బెదిరిపోను.. జగన్‌కి సేవకుడిగా ఉంటానని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తన కూతురికి తనకి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని.., ఇదే పరిస్థితి రేపు పెండెం దొరబాబుకి కూడా రావచ్చు అని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు.