Mudragada Padmanabham To Join In YCP: ఇవాళ వైసీపీలోకి ముద్రగడ

0
12

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీలో చేరనున్నారు. కుమారుడు గిరితో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. తొలుత ర్యాలీగా తాడేపల్లికి వస్తానని ముద్రగడ ప్రకటించారు. అయితే భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని, ఒక్కడినే వెళ్తానని మరో ప్రకటన చేశారు.

ముద్రగడ పద్మనాభం దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 2009లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. జనతా పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి ఎంపీగా గెలుపొందారు. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముద్రగడతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఆయన కొడుకు గిరికి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.