వైసీపీలో చేరేందుకు తాడేపల్లికి భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన ముద్రగడ.. లేటెస్ట్ గా ఒంటరిగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నెల 15 లేదా 16న ఒక్కడినే వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని చెప్పారు. ఇందుకు మీ అందరి ఆశీస్సులు ఉండాలంటూ అభిమానుల్ని కోరారు. తన ప్రకటనకు ఊహించిన దాని కంటే భారీ స్థాయిలో స్పందన వచ్చింది. కూర్చోవడానికి కాదు. నిలబడడానికి కూడా స్థలం సరిపోదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. అందుకే తాడేపల్లికి ర్యాలీగా వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నాని వెల్లడించారు.
ఈ నెల 14న తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ముద్రగడ ప్రకటించారు. .అలాగే ఆయన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తమ స్వగ్రామం కిర్లంపూడి నుంచి బయలుదేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకుంటానని తెలిపారు. ఎలాంటి డిమాండ్లు లేకుండానే జగన్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీన్ని రద్దు చేసుకోక తప్పలేదంటూ ముద్రగడ ఇవాళ అభిమానులకు రాసిన లేఖలో తెలిపారు.