Hardik Pandya Appointed Mumbai Indians Captain for IPL 2024: RIP హార్దిక్ పాండ్య.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

0
20

ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యను నియమించడం రోహిత్ ఫ్యాన్స్ కు ఇంకా మింగుడుపడటం లేదు. ఫ్యాన్స్ ఇంకా మండిపడుతున్నారు. రెస్ట్ ఇన్ పీస్ హార్దిక్ పాండ్య అంటూ హ్యాష్ ట్యాగ్ ను రోహిత్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్తో ఏకంగా 50 వేలకు పైగా పోస్టులు రావడం గమనార్హం.

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ఆ జట్టు ఫ్రాంచైజీ ప్రకటించినప్పటి నుంచి అతడిపై హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై హార్దిక్ తొలిసారి నిన్న స్పందించారు. నేను రోహిత్ అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తా. కానీ, వారిని కంట్రోల్ చేయలేను. వారిని గౌరవిస్తూనే కెప్టెన్‌గా ఏం చేయాలనేదానిపై దృష్టి పెడతా అని పాండ్య చెప్పుకొచ్చారు.

తన కెప్టెన్సీలో హిట్‌మ్యాన్‌ ఆడటం ఇబ్బందేమీపడకపోవచ్చని హార్దిక్ తెలిపాడు. ఈ సీజన్‌లో అతడి సాయంతో జట్టును విజయాల బాట పట్టిస్తాననే నమ్మకం ఉందన్నాడు. నా కెరీర్‌లో చాలా వరకు రోహిత్ కెప్టెన్సీలోనే ఆడాను. ఇప్పుడు ఈ సీజన్‌ లో కూడా ఎల్లప్పూడు తన మద్దతు ఉంటుందన్నాడు హార్దిక్.