AP Politics: ఎన్టీఆర్ భరోసా స్కీమ్‎గా పేరు మార్పు.. వైఎస్ఆర్ టూ ఎన్టీఆర్

0
27

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. సీఎం చంద్రబాబు తనదైన శైలీలో మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు.

వకాగా, ఇందులో భాగంగానే జగనన్న విద్యాదీవెన కానుక స్కీమ్ నేమ్‌ను స్టూడెంట్ కిట్‌గా మార్చిన చంద్రబాబు సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, మరికొందరికి ఆర్థిక సహయం అందించేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా ఈ స్కీమ్‌ పేరును ప్రభుత్వం మార్చింది. వైఎస్ఆర్ ఫించన్ పథకం పేరును తొలగించి ఎన్టీఆర్ భరోసా స్కీమ్‌గా పేరు పునరుద్ధరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి పెన్షన్ దారులకు కీలక హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వస్తే నెలకు రూ.4 వేలు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు పెంఛన్‌ను ప్రభుత్వం పెంచింది.