Ipl Cricket: ఓన్లీ బ్యాటింగ్ .. నో కీపింగ్ .. ఐపీఎల్ కు రాహుల్ రెడీ

0
22

ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయిం ట్స్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి . లక్నో కెప్టెన్ కేఎల్ రాహులకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎస్సీఏ) క్లీన్ చిట్ ఇచ్చింది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్-2024లో రాహుల్ పాల్గొనవచ్చి ఎన్సీఏ పేర్కొంది. దాంతో మరో రెండు రోజుల్లో అతను జట్టుతో కలవనున్నాడని తెలిపింది.

అయితే సీజన్ ఆరంభ మ్యాచుల్లో రాహుల్ కేవలం బ్యాటర్ మాత్రమే కొనసాగాలని ఎన్సీఏ కండీషన్ పెట్టింది. వికెట్ కీపింగ్ చేసేందుకు రాహులు ఇంకా కొంత సమయం పడుతుందని, కీపింగ్ భారాన్ని మోస్తే అతని గాయం తిగబట్టే అవకాశం ఉందని ఎన్సీఏ హెచ్చరించింది. కాగా, ఇటీవల ఇంగ్లండ్ తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి టెస్ట్ సందర్భంగా రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను మిగతా నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్ ఆడతాడా లేదా అనే అనుమానాలు కూడా కలి గాయి. కానీ సోమవారం ఎన్సీఏ అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంతో అనుమానాలు, అపోహలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ సీజన్లో రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతాలు సృష్టించాలని లక్నో అభిమానులు కోరుకుంటున్నారు. జైపూర్ వేదికగా మార్చి 24న జరిగిన తమ తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రాజస్తాన్ రాయల్ ను ఢీకొట్టనుంది.