పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరనున్న వేళ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, నీరబ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో సీఎస్‌గా వ్యవహరించిన కే.ఎస్ జవహార్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లగా కొత్త సీఎస్ నియామకం జరిగినందున ఆయనను బదిలీ చేశారు. బుధవారం టీడీపీ చీఫ్, కాబోయే ఏపీ సీఎం చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవగా.. అప్పటి నుంచే ఆయనను సీఎస్‌గా నియమిస్తారనే వార్తలు జోరందుకున్నాయి. కాగా, శుక్రవారం సీఎస్‌గా నీరబ్ కుమార్‌ను నియవిస్తున్నాట్లు ఉత్తర్వులు జారీ చేశారు.