ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ‘ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాకు ఛాన్స్ ఇచ్చారని . ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పానన్నారు.
నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ పరిగణిస్తారు. అందుకే చేయనని ఆయనకు చెప్పేశానని వెల్లడించారు. వారు తన వాదనను అంగీకరించడం గొప్ప విషయమని.. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పుకోచ్చారు సీతారామన్. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు లేవా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా నిర్మలా సమాధానమిచ్చారు.
ఇదిలాఉంటే, రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న అనేక మంది బీజేపీ నేతలను లోక్‌సభ ఎన్నికల బరిలో ఆ పార్టీ దింపుతోంది. పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, చంద్రశేఖర్, మన్‌సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే.