పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంతో సహ కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన చంద్రబాబు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇక, చంద్రబాబు తమ అభిమాన నేతకు సముచిత స్థానం కల్పిస్తుండటంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఖుష్ అవుతున్నారు.