Viral: ఫుల్లుగా మందేసి చిందేసిన ఒంగోలు ASI.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

0
27

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిధిలోని శంకరాపురంలో ఇటీవల ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఓ వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో మళ్లీ గొడవలు పునరావృతం కాకుండా ఉండేందుకు గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు అక్కడ ఏఎస్సై వెంకటేశ్వర్లుకు డ్యూటీ వేశారు. అయితే, విధి నిర్వహణను విస్మరించిన అతడు గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో ఎంచక్కా మందేసి చిందులేశాడు. ఆ దృశ్యాలను అటుగా వెళ్తున్న కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ పరిణామంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లుగా తెలుస్తోంది.