Owaisi Commented CM Revanth Govrnament: రేవంత్ కు అండగా ఉంటాం..ఐదేళ్లు హాయిగా పనిచేసుకోవచ్చు

0
16

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. రేవంత్ చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. అందుకే ఈ స్థాయికి వచ్చారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తాం. ఐదేళ్లు రేవంత్ ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. సీఎంను కలవగానే ఓల్డ్ సిటీ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేశారు. దీనికి ధన్యవాదాలు చెబుతున్నా’ అని ఒవైసీ తెలిపారు.

అభివృద్ధికి సహకరిస్తాం: అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ అభివృద్ధికి ఎంఐఎం పార్టీ ఎప్పుడూ సహకరిస్తుందని ఆ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలుకు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాకుత్పుర. బహదూర్పుర, డబీరురలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం అడిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రూ. 200 కోట్లు విడుదల చేయడం సంతోషకరమని చెప్పారు. పాతబస్తీని మరింత అభివృద్ధి చేయాలని కోరారు.

ఎంజీబీఎస్-ఫలక్ నుమా మెట్రో లైన్ కు భూమిపూజ

పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మేర ఈ లైన్ను నిర్మించనున్నారు. మరో విడతలో అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మిస్తారు. అలాగే మైనారిటీ గురుకుల స్కూల్, కాలేజీని సీఎం ప్రారంభించారు.