నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్, చంద్రబాబు ఉమ్మడి సభ

0
18

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు, నిడదవోలులలో జరిగే బహిరంగ సభలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్ధరు నేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు. తణుకు నరేంద్ర సెంటర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు.. నిడదవోలులో రాత్రి ఏడు గంటలకు బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇద్దరు నేతలు నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకోనున్నారు. కాగా సభ అనంతరం చంద్రబాబు, పవన్ ఇద్దరు నేతలు రోడ్డు మార్గాన నిడదవోలు చేరుకోనున్నారు. సభ తరువాత చంద్రబాబు నాయుడు నిడదవోలులోనే రాత్రి బస చేస్తారు. అయితే నిడదవోలులో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి యంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది.

అయితే వీరివురు హాజరవుతున్న సభలకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లను అన్ని పూర్తి చేశారు. వీరిద్దరూ వేర్వేరు హెలీ కాఫ్టర్లలో ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకు తణుకు పాలిటెక్నిక్‌ కళాశాలలో ల్యాండ్‌ అయ్యి… అక్కడ నుంచి పట్టణంలోని నరేంద్ర సెంటర్‌ వరకు రోడ్‌ షో నిర్వహిస్తారు. నాలుగు గంటలకు సభ మొదలై.. ఐదున్నర గంటలకు ముగుస్తుంది. అనంతరం రోడ్డు మార్గంలోనే నిడదవోలుకు చేరుకుని రాత్రి ఏడు గంటలకు జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ సభలో కూటమి నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి కూడా పాల్గొంటారు. సభ పూర్తయిన తర్వాత చంద్రబాబు నిడదవోలు తిరుమల సాయి కల్యాణ మండపంలో బస చేస్తారు. పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం షెల్టాన్‌ హోటల్‌లో బస చేస్తారు. రేపు ఉదయం చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో నిడదవోలులో సమీక్ష జరిపి ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తారు. తణుకులో జరిగే ప్రజాగళం సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లను తణుకు మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు.