Phone Tapping Case Registered against KCR: ఫోన్ ట్యాపింక్ కేసు..పంజాగుట్ట పీఎస్లో కేసీఆర్పై ఫిర్యాదు

0
16

ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు సంచలనం సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో(SIB)లో డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ఆ సమయంలో ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టుల ఫోన్ ను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసు అధికారుల విచారణలో తేలింది. దీంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. అసెంబ్లీ ఫలితాలు రాగానే అదే రోజు ఎస్ఐబీ ఆఫీస్ లాగర్ రూమ్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోపలికి వెళ్లాడని… 45 హార్డ్ డిస్కులతో పాటు1800ల ఫైళ్లు ఎత్తుకెళ్లి ధ్వంసం చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు బంధువే ఈ ప్రణీత్ రావు. అందుకే అతన్ని ఎస్ఐబీలో అపాయింట్ చేసినట్లు తెలిసింది. లేటెస్ట్ గా ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయి.

బీఆర్ఎస్​హయాంలో చట్ట విరుద్దంగా ఫోన్ ట్యాపింగ్​ జరిగిందని ఆరోపిస్తూ అరుణ్​కుమార్​అనే లాయర్ ​నిన్న రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ​కేసులో మాజీ సీఎం కేసీఆర్​ను ఏ1గా చేర్చాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ ​సంభాషణలు వినే అవకాశం ఉంటుందని..కానీ అందుకు విరుద్ధంగా ఫోన్​ ట్యాపింగ్ ​చేశారని ఫిర్యాదులో తెలిపారు. బీఆర్ఎస్​హయాంలో జరిగిన అవినీతిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు అరుణ్ కుమార్.