PM Modi : మీకేమైనా రాష్ట్రాలు రాసిచ్చారా?.. కుటుంబ పాలనపై మోడీ ఆగ్రహం

0
22

మోడీ గ్యారంటీ అంటే అది అమలయ్య గ్యారంటీ అని ప్రధాని మోదీ అన్నారు. పటాన్ చెరులోని విజయ్ సంకల్ప యాత్రలో మాట్లాడారు. మోడీ ఏదైనా చెప్తే చేసి చూపిస్తాడు.. ఆర్టికల్ 370ని రద్దు చేసి చూపిస్తామని చెప్పాం..చేసి చూపించాం. రామ్ మందిర్ కడతామని చెప్పాం..కట్టి చూపించాం అని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలతో రెండు రోజులు ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతుందని చెప్పారు. భారత్ ను ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దుతామన్నారు.

కాంగ్రెస్ నేతలు నన్ను విమర్శిస్తున్నారు. తానెప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు మోదీ. కశ్మీ్ర్ నుంచి కన్యాకుమరా వరకు కుటుంబ పాలన ఉన్న ఫ్యామిలీలే బాగుపడ్డాయన్నారు. కటుుంబ పాలనతో రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పారు. కుటుంబ పాలన చేసే వారికి రాష్ట్రాలు రాసిచ్చారా? వాళ్లకేమైనా లైసెన్సులు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికి దేశం ముఖ్యం..తనకు దేశం ముఖ్యమని చెప్పారు మోదీ.

తెలంగాణ సౌతిండియాకు గేట్ వే

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని కట్టుబడి ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటేల్ గూడాలోని ఎస్ఆర్ ఇన్ ఫినిటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీశంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే అన్నారు. నిన్న ఆదిలాబాద్ నుంచి రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించాం. ఇవాళ సంగారెడ్డి నుంచి రూ.9 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతాం. దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రం బేగంపేటలో ఏర్పాటు చేశామని తెలిపారు.

హైదరాబాద్ బేగంపేటలో ఏర్పాటు చేసే సివిల్ ఏవియేషన్ రీసర్చ్ సెంటర్ ద్వారా తెలంగాణకు గుర్తింపు వస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఇది ఏవియేషన్ స్టార్టప్లు. నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపైందన్నారు. రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలు, విద్యుదీకరణ పనులు చేపట్టాం. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పారదీప్ పైపైన్ పనులు చేపట్టామని తెలిపారు.

ఇవాళ ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని మోదీ సందర్శించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మోదీకి ఆశీర్వచనం చేసిన పూజారులు… అమ్మవారి వస్త్రంతో తో పాటు మహంకాళి ఫొటో ఫ్రేమ్ ను బహుకరించారు.