PM Modi in telangana : మోడీ నోట తెలంగాణ బ్రాండ్.. లోక్ సభ కోసం భారీ స్కెచ్

0
15

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తప్ప వేరే పేరు వినిపించడం లేదు. ఈ రెండింటి జోరు ప్రచారంలో బీఆర్ఎస్ సోదిలో లేకుండా పోయింది. మోడీ మళ్లీ ప్రధాని అవుతారని, కేంద్రం నిధులు రావాలంటే తప్పదని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి.. ఆయన్ను ఆకట్టుకునేందుకు పెద్దన్న అని సంబోధించారు. ఇది తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ అంటూ మోడీ కూడా వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. దీంతో.. లోకల్ సెంటిమెంట్, రీజనల్ ఫీవర్ పెంచుతూ ప్రచార జోరు చూపిస్తున్నారు పార్టీల నేతలు.

తెలంగాణలోని సంగారెడ్డిలో ఈరోజు (మార్చి 5) రూ. 7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అంకితం చేసి, శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టులు రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి బహుళ కీలక రంగాల ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నాయి.

సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణను దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా పిలుస్తారని అన్నారు. “తెలంగాణలో రైల్వే సౌకర్యాలను మెరుగుపరచడానికి, విద్యుదీకరణ ప్రక్రియ కూడా జరుగుతోంది” అన్నారాయన.

తెలంగాణ ప్రగతికి తన నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి, రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. “ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) కోసం నిశ్చయించుకున్నారు” అని ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో అన్నారు.