PM Modi Special Gift Gives To Womens: ప్రధాని మోడీ ఉమెన్స్ డే గిఫ్ట్.. వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గింపు

0
16

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. మహిళా దినోత్సవం కానుకగా వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీని వల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. తాము మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గతేడాది రక్షాబంధన్ సందర్భంగా గ్యాస్ ధర కేంద్రం రూ. 200 తగ్గించిన సంగతి తెలిసిందే..

2025 వరకు సబ్సీడీ కొనసాగింపు

మరో వైపు నిన్న జరిగిన కేబినెట్ లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన సబ్సిడీని లబ్ధిదారులకు మార్చి 2025 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద కుటుంబాలకు అందించే వంటగ్యాస్ సబ్సిడీని 14.2 కిలోల సిలిండర్ కు దఫాలుగా కేంద్రం 2023 అక్టోబర్ లో 300కి పెంచింది. లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తించనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.12వేల కోట్లు సబ్సిడీని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.