PM Modi’s Road Show In Malkajgiri: ఇవాళ మల్కాజ్ గిరిలో మోదీ రోడ్ షో..షెడ్యూల్ ఇదే

0
18

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 5గంటల15 నిమిషాల నుంచి 6గంటల15నిమిషాల ల వరకు మల్కాజ్​గిరిలోని మీర్జాలగూడ నుంచి మల్కాజ్​గిరి చౌరస్తా వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొన్నారు. మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరపున ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా.. ఆయనకు మద్దతుగా మోదీ ప్రచారం చేయనున్నారు.

మోదీ షెడ్యూల్

ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 4:50 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, భువనగిరి లోక్​సభ నియోజకవర్గాల నుంచి కనీసం 50 వేల మందిని తరలించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. రోడ్ షో తర్వాత మోదీ సోమాజిగూడలోని రాజ్​భవన్​కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

రేపు నాగర్ కర్నూల్ కు

మోదీ రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నాగర్ కర్నూల్ కు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారు. అనంతరం ఒంటిగంటకు అక్కడి నుంచి గుల్బర్గాకు వెళ్తారు. ఈ నెల18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలోనూ మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.