రామోజీరావు మృతి పట్ల ‘పాయింట్ బ్లాంక్’ యాజమాన్యం సంతాపం

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ తెల్లవారుజామున 4.50కి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. కాగా, రామోజీరావు మృతి పట్ల ‘పాయింట్ బ్లాంక్’ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం మీడియా, సినిమా రంగానికి తీరని లోటు అని యాజమాన్యం సంతాపం వ్యక్తం చేశారు. మీడియా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని రామోజీరావు సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.