Devotion: : తిరుమలలో చెర్రీ దంపతులు.. క్లింకార ఫోటో వైరల్

0
36

సినీ నటుడు రామ్ చరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.స్వామివారికి కూతురు క్లీంకార తలనీలాలు సమర్పించారు రామ్ చరణ్ దంపతులు. ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

చరణ్ దంపతుల కూతురు క్లింకార్ ఫేస్ ఇప్పటి వరకు చూపించలేదు. అయితే తిరుమల దర్శనం సందర్బంగా క్లింకార్ ఫస్ట్ ఫేస్ ఫస్ట్ టైం కాస్త కనిపించింది.ఉపాసన ఎత్తుకుని ఉండగా క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇవాళ గేమ్ చేంజర్ నుంచి జరగండి పాటను నేడురిలీజ్ చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు కుర్రకారుని, అభిమానుల్ని ఆకట్టుకుంటోంది .అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటకు తమన్ క్యాచీ బీట్‌అలరిస్తోంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ అదిరిపోయింది.